బృందావన రావు గారి వ్రాత పత్రి


ప్రయోజనం
సెప్టెంబర్ 14, 2006, 12:57 ఉద.
Filed under: కధలు - కవితలు

ప్రయోజనం

దారికడ్డంగా వున్న రాయిని పక్కకు విసిరేసాను.

‘ఛీ’. పనికి మాలినది అంటూ.

‘మిత్రమా!’ నేనేమీ పనికిమాలినదాన్ని కాదు.
నాలాంటి కొన్ని రాళ్ళను పోగుజేసి గోడను నిర్మించొచ్చు.
మంచి పనివాడు నన్నో శిల్పంగా మలచవచ్చు.
ఆ శిల్పాన్నే ఆలయంలో దేవుడిగా ప్రతిష్టించవచ్చు”,
అంటూ చీవాట్లు పెట్టింది రాయి.

నేను చొక్కా మీద దుమ్ము దులుపుకొని,

“ఛీ! పనికిమాలిన దుమ్ము” అంటూ ముందుకు సాగబోయాను.

“సోదరా! నేనూ పనికిమాలిన దాన్ని కాదు.
నాలాంటి దుమ్మును మరికొంత పోగుచేసి ఎరువుగా వాడుకోవచ్చును.
నీటితో పదును చేసి, సారెకెక్కించి, నన్ను కుండగా రూపొందించవచ్చు.
ఆ కుండను చలివేంద్రలో వుంచి దాహార్తుల దప్పి తీర్చవచ్చు”. అంటూ
దుమ్ము దులిపి వదిలిపెట్టింది.

‘సరే బాగుంది’  అనుకొంటూ ముందుక్కదలబోతే
చెట్టు కొమ్మ మీంచి ఓ పండుటాకు ఠాప్పున తలపై రాలింది.
“ఇదో పనికిమాలినది” అని అనుకోబోతుండగానే

“ఏమయ్యోయ్! నేనస్సలు పనికి మాలినదాన్ని కాను.
నాలాంటి ఆకుల్ని దడిగా బిగించి తడికెగా వాడుకోవచ్చు.
నేలలో త్రొక్కి, నీటితో కుళ్ళ బెట్టి కంపోస్టు చేసి భూసారంగా ఉపయోగించుకోవచ్చు.
మీ ఈనాటి విజ్ఞానమంతా పూర్వం ఎండిన ఆకుల మీదనే భద్రపరిచారు తెలుసా.” అని
పాఠం ప్రారంభించింది పలిత పత్రం.

రాయీ, దుమ్మూ, ఆకూ కలసి నన్ను ప్రశ్నించాయి.

“అయ్యా…మనిషిగారూ!
మాలో లేని మస్తిష్కం మీకుందిగదా..
మేమందరం పనికి మాలిన వాళ్ళం – సరే
మీ వలన ఇతరులకేమైనా ప్రయోజనం కలుగుతున్నదా?”అంటూ.

పరులను వంచించి లాభం పొందడంలో అనుక్షణమూ బిజీగా ఉండే నాకు
పరుల కోసం వెచ్చించడానికి తీరిక ఏ మాత్రం లేదని ఎలా సమాధానం చెప్పడం?

సిహెచ్.వి. బృందావన రావు

ప్రచురణ: Akashicc(జూన్ ’06)

ప్రకటనలు

2 వ్యాఖ్యలు so far
వ్యాఖ్యానించండి

భలే చెప్పారు. అచ్చంగా ఇలాగే నా చిన్నప్పుడు పనికిరానిదేదని తెగ ఆలోచించాను. ప్రతిదీ పనికివచ్చేదే! చివరికి నేను కనుకున్నది సోమరి, స్వార్థపరుడైన జీవించివున్న (చనిపోతే వాడి దేహం పురుగులకు ఆహారంగా పనికి వస్తుంది) మానవుడు అని. మీరిఉ చాలా బాగా చెప్పారు.

— ప్రసాద్
http://charasala.wordpress.com

వ్యాఖ్య ద్వారా charasala

chala baagundhi. e prapanchamlo panikiraanidhi yedi vundadhani baga chepparu..

వ్యాఖ్య ద్వారా prasanth
స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s%d bloggers like this: