బృందావన రావు గారి వ్రాత పత్రి


సహచరి
ఆగష్టు 28, 2006, 10:00 అపరాహ్నం
ప్రచురించిన వర్గము కధలు - కవితలు

ఆమె

ప్రకృతి తనకు ప్రసాదించిన మార్దవత్వాన్ని
గాత్రంలోనే కాక, మనసంతా నింపుకొని
నిన్ను ప్రేమగా లాలిస్తుంది.

నీ వేదనలను తనవిగా అనువదించుకొని
తన కవోష్ణశ్వాసల వీవనలతో
నీ ముఖాన్ని వీచి సేదదీర్చి
నిన్ను ఆపేక్షగా ఆశ్వాసిస్తుంది.

నీ కళ్ళోని మోహాన్నంతా
తన హ్రుదయంలోకి ఒంపుకొని
తన సాంద్ర ఆనందానురాగానికి
గర్భంలో రూపం ఏర్పరచి
వత్సరాంత బహుమతిగా
నీకు కానుక ఆందిస్తుంది.

కుటుంబ జీవన సమరానికి
తానే సేనానాయకి ఐనా
నీ రక్షణకు తానే కత్తీ, డాలూ అయి
నీ అంగరక్షకిగా తాను వెనకే ఒదిగుండి
దళవాయిగా చరిత్రలో
నిన్నేముందు నిలబెడుతుంది.

వాలంటీన్సు రోజనీ, మహిళాదినోత్సవమనీ
అప్పుడప్పుడూ ఆర్భాటం చేసే నిన్ను
మూడొందల అరవై ఐదు రోజులూ
తన మనసులో పొదుపుకొనే వుంటుంది.

భార్యంటే భరింపబడేదనీ, భర్తంటే భరించే వ్యక్తనీ
అర్ధం చెప్పిన నిఘంటువులు
సంసారంలో సర్వాన్నీ భరించే ఆమె విషయంలో మాత్రం
కావాలనే భర్తెవరో, అబద్ధమే చెప్పాయి.

నిజానికి అర్ధాంగి
మగవానికి పూర్ణాంగి.

- సి.హెచ్.వి. బృందావన రావు

ప్రచురణ: నడుస్తున్న చరిత్ర (మే ‘06)


అభిప్రాయములు ఇప్పటి వఱకు
మీ ఉద్దేశ్యం…

Wonderful!!

వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా swathi

చాలా బాగుంది.
సామాన్య గృహిణి సమున్నత స్తానమేంటో చక్కగా చెప్పారు.

– ప్రసాద్
http://charasala.wordpress.com

వ్యాఖ్య�వ్యాఖ్యలు ద్వారా charasala




మీ ఉద్దేశ్యం…
Line and paragraph breaks automatic, e-mail address never displayed, HTML allowed: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>